Nara Lokesh : నేడు కడప జిల్లాలో లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి కడప జిల్లాకు చేరుకున్న లోకేశ్ కు పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. రాత్రి చింతకొమ్మదిన్నె మండలం కొలుముల పల్లె గ్రామంలో బస చేసిన లోకేశ్ నేడు పెంండ్లిమర్రి మండలంలో డిగ్రీ కళాశాలను ప్రారంభించనున్నారు.
టీడీపీ కార్యకర్తల సమాేశంలో...
అనంతరం కొప్పర్తి పారిశ్రామికవాడలో టెక్స్ టైల్ యూనిట్ ను కూడా మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. తర్వాత జమాల్ పల్లెలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో లోకేశ్ సమావేశమవుతారు. వారితో ముఖాముఖి మాట్లాడతారు. వారికి పార్టీ నేతలు అండగా ఉంటారని భరోసా ఇవ్వనున్నారు. సాయంత్రం బయలుదేరి విజయవాడకు చేరుకోనున్నారు.