Nara Lokesh : దావోస్ లో లోకేష్ చేసిన పనికి?
మంత్రి నారా లోకేష్ దావోస్ లో పర్యటిస్తున్నారు. అయితే ఇప్పుడు లోకేష్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ దావోస్ లో పర్యటిస్తున్నారు. అయితే ఇప్పుడు లోకేష్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాలినడకన దావోస్ వరల్డ్ ఎకనామిక్ సదస్సుకు హాజరు కావడం అందరినీ ఆకట్టుకుంటుంది. గత మూడు రోజులుగా దావోస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం దావోస్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రతి కూల వాతావరణంలో...
పూర్తి ప్రతికూల వాతావరణంలో దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు మంత్రి లోకేశ్ కాలి నడకన వెళ్ళడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దావోస్ లో ప్రస్తుతం మైనస్ ఏడు డిగ్రీలుగా ఉష్ణోగ్రత ఉండటంతో ఎముకలు కొరికే చలిలో ట్రాఫిక్ ను అధిగమించి కాలి నడకన నిర్ణీత సమయానికి కాంగ్రెస్ సెంటర్ కు నారా లోకేష్ చేరుకున్నారు.