Andhra Pradesh : ఏపీలో స్కూళ్లకు రెండురోజులు ముందుగానే దసరా సెలవులు

విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Update: 2025-09-19 07:19 GMT

విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు2వ తేదీ వరకూ దసరా సెలవులు కొనసాగనున్నాయి. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ రెండు రోజుల పాటు అదనంగా సెలవు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఉపాధ్యాయసంఘాల విజ్ఞప్తి మేరకు...
ఇటీవల ఆంధప్రదేశ్ విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ విద్యాసంస్థలు అన్నింటికీ తొమ్మిది రోజులు దసరా సెలవులు ప్రకటించింది. ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకూ దసరా సెలవులను ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. మొత్తం తొమ్మిదిరోజులు పాటు సెలవులు ప్రకటించింది. కాని రెండు రోజులు ముందుగానే దసరా సెలవులు ప్రకటించడంతో మొత్తం పదకొండురోజుల పాటు ఏపీలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లయింది


Tags:    

Similar News