తెల్లకార్డులు లేని వారికి కూడా ఉచిత చికిత్స.. మంత్రి గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గుడ్ న్యూస్ చెప్పారు

Update: 2025-03-12 05:27 GMT

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలుపు రేషన్ కార్డు లేనివారికీ తలసేమియా చికిత్స అందిస్తామని తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ తలసీమియా వ్యాధితో బాధపడేవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ వారికి ఉచితంగా చికిత్స అందిస్తామని చెప్పారు.

ఇరవై ఐదు వేల ఆదాయం...
ఎవరూ భయపడాల్సిన పనిలేదన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చూసుకుంటుందని తెలిపారు. ఇరవై ఐదు వేల రూపాయల ఆదాయం ఉన్నవారికి కూడా వర్తింప చేస్తామని తెలిపారు. తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నామన్న మంత్రి సత్యకుమార్ బాధితులకు అండగా నిలుస్తామని తెలిపారు.


Tags:    

Similar News