నేడు సిట్ ఎదుటకు మిధున్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లోనేడు రాజంపేట పార్లమెంటు సభ్యులు మిధున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు

Update: 2025-04-19 02:41 GMT

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ కు సంబంధించి నేడు రాజంపేట పార్లమెంటు సభ్యులు మిధున్ రెడ్డిని విచారించనున్నారు. స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఎందుటకు నేడు మిధున్ రెడ్డి హాజరు కానున్నారు. మద్యం స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగం పెంచారు. ఇప్పటికే కసిరెడ్డి రాజ్ తండ్రితో పాటు విజయసాయిరెడ్డిని కూడా విచారణ చేశారు.

విచారణలో నేడు...
నేడు మిధున్ రెడ్డిని కూడా విచారించనున్నారు. మిధున్ రెడ్డి పేరు విజయసాయిరెడ్డి కూడా చెప్పడంతో ఈ విచారణలో కీలకమైన ప్రశ్నలతో ఆయనను ఈ స్కామ్ కు సంబంధించిన అంశాలపై విచారణను చేయడానికి సిట్ అధికారులు సిద్ధమయ్యారు. మరొకవైపు హైకోర్టు సూచనల మేరకు మిధున్ రెడ్డితో పాటు ఆయన తరుపున న్యాయవాది నేడు విచారణకు హాజరు కానున్నారు.


Tags:    

Similar News