ఎమ్మెల్సీల రాజీనామాలపై మండలి ఛైర్మన్ ఏమన్నారంటే?
ఎమ్మెల్సీ రాజీనామాల విషయంలో ప్రొసీజర్ ప్రకారం వెళ్తామని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ మోషేను రాజు తెలిపారు
ఎమ్మెల్సీ రాజీనామాల విషయంలో ప్రొసీజర్ ప్రకారం వెళ్తామని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ మోషేను రాజు తెలిపారు. కొందరు ఎమ్మెల్సీల రాజీనామా లేఖలు తన వద్ద ఉన్నాయని, వాటిని ప్రొసీజర్ ప్రకారం పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నానని మోషేన్ రాజు తెలిపారు. ఎమ్మెల్సీల రాజీనామాల విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని చెప్పారు.
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో...
దీంతో పాటు రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు అవాస్తవమని శాసనమండలి ఛైర్మన్ మోషేను రాజు అభిప్రాయపడ్డారు. ఇందుకు రఘురామకృష్ణరాజు సహకరించాలని కోరారు. గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కలెక్టరేట్ నిర్మించాలని మోషేన్ రాజు తెలిపారు. జిల్లా కలెక్టరేట్ విషయలో రఘురామ కృష్ణరాజు చేస్తున్న ఆలోచనను మార్చుకోవాలని కూడా ఆయన కోరారు.