నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం ఐదు రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం ఐదు రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నారు. వర్షాకాల సమావేశాలలోనే మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుందన్న వార్తలు అందుతున్నాయి. ఈ సమావేశాల్లోనే కీలక బిల్లులను కూడా ఆమోదించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఈరోజు బీఏసీ కమిటీ సమావేశాన్ని నిర్వహించి సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్నది నిర్ణయిస్తారు. తొలిరోజు ముఖ్యమంత్రి మూడు రాజధానుల పై ముఖ్యమంత్రి జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.
కీలక బిల్లులను...
ఈ సమావేశాల్లో నాలుగు రెవెన్యూ శాఖకు చెందిన బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాశ్వత భూ యాజమాన్ హక్కు కల్పించేందుకు టైటలింగ్ యాక్టు లో సవరణ కూడా తీసుకు రాబోతున్నారు. ఇక వివిధ కీలక అంశాలపై కూడా స్వల్ప కాలిక చర్చను చేపట్టబోతున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను చర్చించే అవకాశముంది. శాసనసభ, శాసనమండలి సమావేశాల సందర్భంగా ఆ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.