సభలో జగన్ కు ఇరుకున పెట్టాలంటే?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ వ్యూహాలు వేరే విధంగా ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ వ్యూహాలు వేరే విధంగా ఉన్నాయి. వైఎస్ వివేకా హత్యను ప్రధానంగా ప్రస్తావించాలని టీడీపీ భావిస్తుంది. వైఎస్ వివేకా హత్య కేసులో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని చెప్పి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ ఆలోచన చేస్తుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను లేవనెత్తి వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించాలని భావిస్తుంది.
ఈ నెల 26 వరకూ...
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 26వ తేదీ వరకూ జరగనున్నాయి. దీంతో జగన్ ను శాసనసభలో ఇబ్బంది పెట్టాలంటే వైఎస్ వివేకా హత్యను ప్రధానంగా ప్రస్తావించాలని, అవసరమైతే సభలోనే ఆందోళనకు దిగాలని టీడీపీ భావిస్తుంది.