Andhra Pradesh : ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారానికి వాయిదా పడింది
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. ఈరోజు శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. పది గంటలకు ప్రారంభమైన బడ్జెట్ ప్రసంగాలు ఇద్దరూ పన్నెండు గంటలకు ముగించారు.
వరస సెలవులు కావడంతో...
దీంతో బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు శాసనసభను సోమవారానికి వాయిదా వేశారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో సోమవారినికి శాసనసభ వాయిదా పడింది. తిరిగి సోమవారం నుంచి బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. అయితే ఈ బడ్జెట్ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ దూరంగా ఉంది.