Andhra Pradesh : ఏపీకి తుపాను ముప్పు

ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Update: 2025-06-11 04:13 GMT

ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కి భారీ వర్ష సూచనను చేసింది. ఎండలతో అల్లాడిపోతున్న ఏపీకి ఊరట లభించనుంది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

అరేబియా మహాసముద్రంలో...
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను తరహా వాతావరణ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో జూన్ 12వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.


Tags:    

Similar News