YSRCP : నేడు జగన్ క్వాష్ పిటీషన్ పై విచారణ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్వాష్ పిటీషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్వాష్ పిటీషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన కేసులో జగన్ పై కేసు నమోదయింది. ఈ కేసులో పోలీసులు జగన్ ను ఏ2 గా చేర్చారు. జగన్ తో పాటు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజని పేర్లను కూడా నిందితులుగా చేర్చారు.
అన్ని పిటీషన్లను...
అయితే విడివిడిగా వీరంతా వేసిన క్వాష్ పిటీషన్లను నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. విచారణ పూర్తయి తీర్పు వెలువడేంత వరకూ జగన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ జగన్ తరుపున న్యాయవాదులు కోరారు. అయితే దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. నేడు క్వాష్ పిటీషన్ పై విచారణ చేపట్టిన అనంతరం ఆదేశాలు ఇచ్చే అవకాశముంది.