నేడు ముగ్గురు వైసీపీ నేతలకు హైకోర్టులో కీలకమే
నేడు వైసీపీకి చెందిన ముగ్గురు నేతలకు సంబంధించిన బెయిల్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరపనుంది
నేడు వైసీపీకి చెందిన ముగ్గురు నేతలకు సంబంధించిన బెయిల్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరపనుంది. నేడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. నేడు దీనిపై విచారణ జరపనుంది.
ముందస్తు బెయిల్ పై...
నేడు మాజీ మంత్రి విడదల రజని ముందస్తు బెయిల్ పై కూడా హైకోర్టులో విచారణ జరగనుంది. క్వారీ యాజమాన్యం వద్ద నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై విడదల రజనిపై కేసు నమోదయింది. దీనిపై విడదల రజని ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ వేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. అలాగే మరో నేత పోసాని కృష్ణమురళి క్వాష్ పిటీషన్ పై కూడా నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. నెల్లూరు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ పోసాని క్వాష్ పిటీషన్ వేశారు.