హెవీ రెయిన్ అలెర్ట్.. ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు

ఏపీని భారీ వర్షాలు వీడటం లేదు. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

Update: 2021-11-24 03:42 GMT

ఆంధ్రప్రదేశ్ ను భారీ వర్షాలు వీడటం లేదు. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మొన్నటి వరకూ వాయుగుండంతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ కు మరో అల్పపీడనం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

మరో నాలుగు రోజులు....
ఉపరితల ఆవర్తనం 24 గంటల్లో అల్పపీడనం గా మారి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. తమిళనాడులో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నేటి నుంచి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీంతో ప్రభుత్వం కూడా తీర ప్రాంత అధికారులను అప్రమత్తం చేసింది.


Tags:    

Similar News