Andhra Pradesh : నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇక వరస నోటిఫికేషన్లను విడుదల చేయనుంది

Update: 2025-04-22 03:31 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇక వరస నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. ఎస్సీ వర్గీకరణ అమలులోకి రావడంతో ఇక నోటిఫికేషన్లు వరసగా విడుదల కానున్నాయి. ఇప్పటికే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసిన ప్రభుత్వం మరో కీలకమైన నోటిఫికేషన్లు విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 866 పోస్టుల భర్తీకి పద్దెనిమిది నోటిఫికేషన్లను విడుదల చేయడానికి ఏపీపీఎస్సీ సిద్ధమయింది.

వివిధ శాఖలకు సంబంధించి...
అటవీ శాఖకు సంబంధించన పోస్టులే ఇందులో 814 వరకూ ఉన్నాయి. వ్యవసాయ శాఖ, దేవాదాయ శాఖల్లోనూ భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ సిద్ధమవుతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. వీటికి సంబంధించిన షెడ్యూల్ ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సో.. నిరుద్యోగులారా.. బీ రెడీ.


Tags:    

Similar News