Andhra Pradesh : ఉపాధ్యాయులకు ముందే దసరా పండగ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా పండగకు ముందు మెగా డీఎస్సీలో ఎంపికయిన అభ్యర్థులకు నేడు నియమాక పత్రాలను అందచేయనుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా పండగకు ముందు మెగా డీఎస్సీలో ఎంపికయిన అభ్యర్థులకు నేడు నియమాక పత్రాలను అందచేయనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ ఫైలు పై చేశారు. రాష్ట్రంలో మొత్తం 15,941 మంది ఉపాధ్యాయులు మెగా డీఎస్సీ ద్వారా ఎంపికయ్యారు. దీంతో వారికి నేడు నియామక పత్రాలను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమయింది.
నేడు నియామక పత్రాల అందచేత...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కోరారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగం పొందిన అభ్యర్థితో పాటు కుటుంబంలోని ఒకరికి ఈ కార్యక్రమానికి అనుమతిచ్చారు. మొత్తం 32 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, దసరాకు ముందే వారికి తీపికబురును అందించడానిక ప్రభుత్వం సిద్ధమయింది.