విశాఖలో టీసీఎస్ కు భూ కేటాయింపులపై ఉత్తర్వులు

విశాఖలో ఏర్పాటు చేయనున్న టీసీఎస్ క్యాంపస్ కు భూమిని కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది

Update: 2025-04-22 02:14 GMT

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఐటీ క్యాంపస్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం 21.16 ఎకరాల భూమిని ఎకరా 99 పైసల చొప్పున కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చింది. ఈ క్యాంపస్‌ నిర్మాణానికి టీసీఎస్‌ రూ.1,370 కోట్లు ఖర్చు చేయనుంది. మొన్న మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు భూమిని కేటాయించారు.

పన్నెండు వేల మందికి...
విశాఖలో టీసీఎస్ క్యాంపప్ ఏర్పాటయితే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం గత కొన్ని నెలలుగా విశేషంగా పనిచేస్తుంది. ఈ క్యాంపస్ విశాఖలో ఏర్పాటయితే ఇక్కడ 12 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనివల్ల విశాఖలో మరికొన్ని ఐటీ పరిశ్రమలు వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News