Amaravathi : రాజధానిలో రెండో విడత భూసమీకరణకు సిద్ధం

రాజధాని అమరావతికి రెండో విడత భూసమీకరణకు ప్రభుత్వం సిద్ధమయింది

Update: 2025-05-18 03:59 GMT

రాజధాని అమరావతికి రెండో విడత భూసమీకరణకు ప్రభుత్వం సిద్ధమయింది. మరో నలభై వేల ఎకరాలను సమీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ విమానాశ్రాయంతో పాటుగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అవసరమైన భూములు ఇంకా అవసరమవుతాయనిభావించి భూ సేకరణ చేయాలని నిర్ణయించారు.

ప్రజాభిప్రాయ సేకరణ...
అయతే తొలి విడతలో మాదిరిగానే రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే వారికి విలువైన ప్లాట్లను ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది. ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు నేడు అమరావతి రాజధాని ప్రాంతంలో అధికారులు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. నేడు బలుసుపాడు, కంభంపాడు గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది.


Tags:    

Similar News