Andhra Pradesh : ఇక వారందరికీ గుడ్ న్యూస్.. ఆగస్టు నెల నుంచే వారికి కొత్త పింఛన్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అర్హులైనవారికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది

Update: 2025-07-26 07:22 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అర్హులైనవారికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.ఆగస్టు నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1,99,155 మందికి పెన్షన్ ఇచ్చేందుకు అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెల చి దాదాపు లక్షమందికి పైగా పెన్షన్లు ఇవ్వనున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు పెన్షన్ అందని వారు లబ్ధిదారులుగా పేరును నమోదు చేసుకోవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం పెన్షన్ దారులకు తీపికబురును చెప్పేందుకు సిద్ధమయింది. గత ప్రభుత్వం అనర్హులుగా భావించి తొలగించిన వారు కూడా అర్హత ఉంటే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

భర్తలు చనిపోతే...
ఎవరైనా పెన్షన్ పొందుతున్న భర్తలు చనిపోతే, వారి భార్యలు ఈ పెన్షన్లను పొందడానికి అర్హులు. గతంలో కూడా ఇలాంటి వితంతు పెన్షన్లు ఇచ్చారు. కాదంటే ఇంకా చాలామంది కొత్తవారు ఉండిపోయారు. వారికోసమే ప్రభుత్వం ఇపుడు ఈ నిర్ణయం తీసుకుందని మంత్రులు చెబుతను్నార. భర్త చనిపోతే కచ్చితంగా భార్యకు పెన్షన్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతినెలా ఇలా కొత్తగా చనిపోతున్నవారి జాబితాని సేకరించి, వారి భార్యలను ఈ కొత్త పెన్షన్ల జాబితాలో చేర్చనున్నారు. వారికి పెన్సన్ వచ్చేలా చేస్తారు. ఆగష్టులో మొదలైన ఈ పెన్షన్ల కింద, ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున ఇస్తారు. ఇలా ఈ అదనపు వితంతు పెన్షన్ల కోసం రూ.43.66 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.
అర్హులైనవారందరికీ...
ఆంధ్రప్రదేశ్ లో అర్హులైనవారందరికీ పెన్షన్ అందడం లేదని కూటమి ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం సర్వేలు జరిపి, జాబితాను సిద్ధం చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ తీసుకునేవారి సంఖ్య 62,81,768 మంది ఉన్నారు. అయితే ఇందులో కొంతమంది చనిపోయినవారు, మిస్సింగ్ అయినవారు, విదేశాలకు వెళ్లిపోయినవారు, అందుబాటులో లేని వారు, అనర్హులు దాదాపు మూడు లక్షలకు పైనే ఉన్నట్టు కూటమి ప్రభుత్వం చెబుతుంది. వీరందరినీ ఇప్పుడు పెన్షన్ లిస్ట్‌లోంచి తొలగించి ఆ డబ్బులను ఇప్పుడు వింతతు పెన్షన్ల కింద ఇవ్వాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో నివాసముంటూ అర్హత కలిగిన వారికి పింఛన్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.


Tags:    

Similar News