ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..మద్యం మరణాలపై విచారణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జంగారెడ్డి గూడెంలో జరిగిన కల్తీ మద్యం మృతులకు సంబంధించి విచారణకు ఆదేశించింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగిన కల్తీ మద్యం మృతులకు సంబంధించి విచారణకు ఆదేశించింది. ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఈ కేసును అప్పగించింది. నాసిరకం మద్యాన్ని వైఎస్ జగన్ హయాంలో సరఫరా చేశారంటూ గతంలో టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించింది.
పోస్టుమార్టం రిపోర్టు కూడా...
అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ పై దర్యాప్తు జరుగుతున్న సమయంలో జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం తాగి పలువురు గిరిజనులు మరణించడంపై విచారణకు ఆదేశించింది. విచారణ జరిపి వెంటనే నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. నాటి ప్రభుత్వం గిరిజనులు మరణించినా పోస్టు మార్టం రిపోర్టు కూడా బయటపెట్టకపోవడంతో కూటమి ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.