Andhra Pradesh : డీఎస్సి సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ మార్పు
డీఎస్సి సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ మార్పు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
డీఎస్సి సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ మార్పు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,347 డిఎస్సి పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ మారినట్లు మెగా డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. తొలుత సోమవారం వెరిఫికేషన్ నిర్వహించాలని భావించినా దానిని వాయిదా వేశారు.
కొన్ని కారణాలతో...
అనేక క కారణాలతో డీఎస్సి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను మంగళ, బుధవారాల్లో చేపట్టనున్నట్లు వివరించారు. ఆన్ లైన్ అప్లికేషన్ లో అభ్యర్థి ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్యత క్రమంలోనే సీవీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 22న డీఎస్సీ కి సంబంధించిన మెరిట్ లిస్ట్ రిలీజైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. ఆ తర్వాతే నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు.