భోగాపురం ఎయిర్ పోర్టు వద్ద ఐదు వందల ఎకరాల కేటాయింపు
భోగాపురం ఎయిర్‌పోర్టు సిటీ సైడ్ డెవలప్‌మెంట్ కోసం భూమి కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
భోగాపురం ఎయిర్‌పోర్టు సిటీ సైడ్ డెవలప్‌మెంట్ కోసం భూమి కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిటీ సైడ్ డెవలప్‌మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏవియేషన్ హబ్ నిర్మాణంలో భాగంగా సిటీ సైడ్ డెవలప్‌మెంట్ చేయాలని ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
జీవీఐఏఎల్ సంస్థకు
దీంతో జీవీఐఏఎల్ సంస్థకు 500 ఎకరాల కేటాయింపునకు ఇటీవలే కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రుల కమిటీ సిఫార్సుతో ఎయిర్‌పోర్టుకు భూకేటాయింపునకు ఆమోదం తెలిపింది. విమానాశ్రయ అభివృద్ధి కోసం 1,733 ఎకరాల మేర ప్రతిపాదించింది. జాతీయ రహదారి నుంచి విమానాశ్రయ అనుసంధానానికి 92 ఎకరాల మేర ప్రతిపాదన చేసింది.