ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు కాఫర్ డ్యాం ఎత్తు పెంచాలని డిసైడ్ అయింది.

Update: 2022-07-15 12:23 GMT

పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు కాఫర్ డ్యాం ఎత్తు పెంచాలని డిసైడ్ అయింది. ముందుస్తు చర్యల్లో భాగంగా ఎత్తు పెంచక తప్పదన్న నిర్ణయానికి వచ్చింది. 28 లక్షల క్యూసెక్కుల సామర్థ్యం మేరకు ప్రస్తుతం కాఫర్ డ్యాం తట్టుకోగలదని నిపుణులు చెబుతున్నారు.

రేపటికి 30 లక్షలు...
రేపటికి ముప్ఫయి లక్షల క్యూసెక్కులు నీరు వచ్చే అవకాశముందని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అందుకే ఎత్తు పెంచితే మంచిదని, భవిష్యత్ లో భారీ స్థాయిలో వరదలు వచ్చినా తట్టుకునే విధంగా కాఫర్ డ్యామ్ ఎత్తుపెంచాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ఎంత పెద్ద స్థాయిలో వరదలు వచ్చినా తట్టుకునే విధంగా ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ ఎత్తును పెంచాలన్నది ప్రభుత్వ నిర్ణయంగా తెలుస్తోంది.


Tags:    

Similar News