కడప మేయర్ సురేష్ బాబుపై వేటు
కడప మేయర్ ను సురేష్ బాబును ప్రభుత్వం తొలగించింది.
కడప మేయర్ ను సురేష్ బాబును ప్రభుత్వం తొలగించింది. మున్సిపల్ శాఖ నిబంధనలను ఉల్లంఘించి తమ బంధువులకు కాంట్రాక్టు పనులకు అప్పగించారన్న ఆరోపణలపై కడప మేయర్ సురేష్ బాబును ఆ పదవి నుంచి తొలగించింది. మున్సిపల్ చట్టాలను ఉల్లంఘించారని విచారణలో తేలిందని మున్సిపల్ శాఖ తెలిపింది.
కాంట్రాక్టు పనులకు అప్పగించారని...
దీనిపై నోటీసులు ఇచ్చిన మున్సిపల్ శాఖ విచారణకు హాజరు కావాలని కోరింది. నిన్న సురేష్ బాబు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ శాఖ కార్యదర్శి ఎదుటహాజరయ్యారు. తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన సంస్థకు అరవై లక్షల రూపాయల కాంట్రాక్ట్ పనులకు అప్పగించారన్న ఆరోపణలపై ఆయనను తొలగిస్తూ నిర్ణయిం తీసుకున్నారు. ప్రభుత్వం సురేష్ బాబుపై అనర్హతవేటు వేసింది.