Anna Datha Sukhibhava : అన్నదాత సుఖీభవ పథకంపై బిగ్ అప్ డేట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీ భవ పథకానికి సంబంధించి బిగ్ అప్ డేట్ వచ్చింది.

Update: 2025-03-12 04:24 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీ భవ పథకానికి సంబంధించి బిగ్ అప్ డేట్ వచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు విధివిధానాలను సిద్ధం చేశారు. ఇప్పటికే అన్నదాత సుఖీ భవ పథకానికి 6,300 కోట్ల రూపాయలు ఈ ఏడాది ప్రభుత్వం కేటాయించింది. బడ్జెట్ లో ఈ నిధులను కేటాయించడంతో ఈ ఏడాది రైతులకు ఈ పథకం కింద నిధులు విడుదల చేయనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం పీఎం సమ్మాన్ నిధులు విడుదల చేసిన సమయంలో ఈ నిధులను కూడా విడుదల చేయాలని నిర్ణయించడంతో మరికొద్ది రోజులు ఆగినా అందుకు సంబంధించిన అర్హులు ఎవరు? అనర్హులు ఎవరు? అన్న దానిపై ఇప్పటికే అధికారులు కసరత్తులు ప్రారంభించి ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది.

మే నెలలో...
కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను జమ చేయనుండటంతో మొన్న ఫిబ్రవరి నెలలోనే కేంద్ర నిధులు పడ్డాయి. పీఎం కిసాన్ నిధులు మే లేదా జూన్ నెలలో పడే అవకాశముంది. వాటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలతో పాటు మరో నాలుగు వేల రూపాయలు ఇచ్చే అవకాశముంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పెట్టుబడి సాయం కింద మూడు విడతలుగా సాయం చేయాలని నిర్ణయించారు.
అర్హత ఎవరికంటే?
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల కు పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇవ్వనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విడత ఎంత మేరకు నిధులు కలపనుందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. నిధులను సమీకరించే ప్రయత్నంలో అధికారులున్నారు. పీఎం కిసాన్ పొందే ప్రతి రైతుకు ఈ పథకం అమలు చేయాలని ప్రాధమికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు అదనంగా పీఎం సమ్మాన్ పథకం అందని వారిలో అర్హుల జాబితాను పరిశీలించాలని కూడా చంద్రబాబు అధికారులను ఆదేశించడంతో ఈ మేరకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేసినట్లు తెలిసింది.


Tags:    

Similar News