Andhra Pradesh : మెగా డీఎస్సీ పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీపరీక్షలను వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీపరీక్షలను వాయిదా వేసింది. ఈ నెల 20, 21వ తేదీన జరగాల్సిన పరీక్షలను జులై 1,2 తేదీలకు మార్చింది. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్న తరుణంలో ప్రతిష్టాత్మకంగాతీసుకున్న ప్రభుత్వం 20, 21వ తేదీలో జరగాల్సిన మెగా డీఎస్సీ పరీక్షలను ఈ మేరకు మెగా డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు.
కొత్త హాల్ టిక్కెట్లను...
ఈ నెల 25వ తేదీ నుంచి హఆల్ టికెట్లను అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. https//apdsc.apfss.in లో హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. కొత్తగా విడుదల చేసిన హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకుని వాటి ప్రకారం పరీక్షలకు హాజరు కావాని కోరారు. యోగా దినోత్సవం సందర్భంగా అభ్యర్థుల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతుందని పరీక్షలను వాయిదా వేయడం జరిగిందని ఆయన చెప్పారు. అందుకే పరీక్షల తేదీల్లో మార్పు
చేసినట్లు చెప్పారు.