Andhra Pradesh : పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ దూకుడు
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగం పెంచింది
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగం పెంచింది. ఈ ప్రాజెక్టు విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీపీఆర్ తయారు చేసేందుకు కన్సల్టెన్సీ నియామకం కోసం ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లు జలవనరులశాఖ ఆహ్వానించింది. కేంద్ర జలసంఘం మార్గదర్శకాల ప్రకారం పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు టెండర్లలో పేర్కొన్నారు.
డీపీఆర్ కు టెండర్లు...
కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆ కన్సల్టెన్సీకే ఉందని టెండర్లలో నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. 9.20 కోట్ల చెల్లింపుతో అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీ కోసం ప్రకటన జారీ చేసింది. ఈరోజు నుంచి అక్టోబరు 22వ తేదీ వరకు బిడ్ లో పాల్గొనేందుకు వీలుగా టెండర్లు దాఖలు చేసే అవకాశం ఉంది.