వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గృహాలను నిర్మించుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గృహాలను నిర్మించుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఇళ్ల నిర్మాణానికి యూనిట్‍కు అదనంగా ఆర్థికసాయం అందించనుంది. ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు చొప్పున ఆర్థికసాయం ప్రభుత్వం అందించనుంది. ఎస్టీలకు రూ.75 వేలు చొప్పున ఆర్థికసాయం ప్రభుత్వం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అదనపు సాయం...
ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ వారికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందచేయాలని కూడా ఏపీ సర్కార్ నిర్ణయించింది. ప్రధానమంత్రి అర్బన్, గ్రామీణ్, పీఎం జన్మన్ పథకం కింద అదనపు నిధులు మంజూరు చేయడానికి అవసరమైన ఉత్తర్వులు త్వరలోనే విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమయింది. ఇది గృహాలను నిర్మించుకునే వారికి ఊరట అని చెప్పాలి.