గ్రీస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు.. ఉచిత నివాసంతో పాటు ఏడాదికి ఇరవై ఐదు లక్షల వేతనం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లోని యువతకు ఇతర దేశాల్లో ఉద్యోగాలను కల్పించేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. అనుభవం ఉన్న ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తుచేసుకోవాలని, అర్హతలున్న వారిని ఎంపికచేస్తామని ఆయన చెప్పారు.
అనుభవం ఉన్న వారికే...
అనుభవం ఉన్న డాట్ నెట్, ఎంఎస్ ఎస్క్యూఎల్ డెవలపర్లను గ్రీస్‌లో ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన వారికి రూ.25.2 లక్షల వార్షిక వేతనం లభిస్తుందని, అక్కడకు ఎంపికయిన వారికి ఉచిత నివాసం, పబ్లిక్ ఇన్సూరెన్స్, సామాజిక భద్రత, కాంట్రాక్టు రెన్యువల్ ప్రయోజనాలు ఉంటాయన్నారు. డాట్ నెట్, ఎంఎస్ ఎస్క్యూఎల్‌లో కనీసం ఐదేళ్ల అనుభవం, మెరుగైన ఇంగ్లిష్ కమ్యూనికేషన్ నైపుణ్యం కలిగిన పురుషులు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు http://naipunyam.ap.gov.in 3లో దరఖాస్తు చేయాలని తెలిపారు. మరింత సమాచారం కోసం 9988853335ను
సంప్రదించాలని కోరారు.