Andhra Pradesh : నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారికి నాలుగు లక్షలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర గృహనిర్మాణ పథకాన్ని పీెం ఆవాస్ యోజన తో అనుసంధానం చేయాలని ఇటీవల నిర్ణయించింది. దీనివల్ల కొత్తగా ఈ పథకం కింద ఎంపికయిన లబ్దిదారులకు సొంత ఇంటిని నిర్మించుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి...
ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా కింద అరవై శాతం ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మిగిలిన నలభై శాతం ఇస్తారు అయితే ఇళ్ల నిర్మాణాల కోసం లబ్దిదారుల ఎంపికపై సర్వే చేపట్టాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశిచండంతో అర్హులైన లబ్దిదారుల జాబితాను గృహనిర్మాణ శాఖ అధికారులు రూపొందించే పనిలో ఉన్నారు.