Andhra Pradesh : ఏపీలో ఇల్లు కావాలా? ఈ అర్హతలు మీకుంటే ఇల్లు వచ్చినట్లే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ప్రారంభించనుంది.

Update: 2025-01-17 13:48 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ప్రారంభించనుంది. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున స్థలం కేటాయించున్నట్లు తెలిపింది. అయితే గతంలో ఎప్పుడూ ఇంటి కోసం లోన్ పొంది ఉండకూడదన్న నిబంధనను మాత్రం ప్రభుత్వం ఈ పధకంలో విధించింది.

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న...
దీంతో పాటు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే ఇళ్లను కేటాయిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇంటి స్థలం, పక్కా ఇల్లు పొందాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని, ఏపీకి చెందిన వారై ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు. మెట్ట ప్రాంతాల్లో ఐదు ఎకరాలు, మాగాణి భూమి 2.5 ఎకరాలకు మించి ఉండకుండా ఉన్నవారే ఈ పథకానికి అర్హులని తెలిపింది.


Tags:    

Similar News