Andhra Pradesh : ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేటి నుంచి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేటి నుంచి జూన్ 2వ తేదీ వరకూ ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని సడిలిస్తే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలు, పోస్టింగ్ లకు సంబంధించి గైడ్ లైన్స్ ను కూడా పర్భుత్వం విడుదల చేసింది. జూన్ 3వ తేదీ నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమలులోకి వస్తుందని తెలిపింది.
బదిలీలకు గ్రీన్ సిగ్నల్...
ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులు ఖచ్చితంగా బదిలీ అవుతారు. ఐదేళ్లు పూర్తికాని ఉద్యోగులు కూడా వారి అభ్యర్థన మేరకు బదిలీలకు అర్హులుగా నిర్ణయించరు. 2026 మే 31వ తేదీలోపు పదవీ విరమణ చేసిన వారికి బదిలీలు ఉండవని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే వారు స్వయంగా విజ్ఞప్తి చేసినా లేక పరిపాలనపరమైన కారణాలతో వారిని బదిలీ చేసే అవకాశముంది.