Andhra Pradesh : దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 14వ తేదీ నుంచి సదరం స్లాట్ బుకింగ్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. దివ్యాండగులకు సంబంధించి వైకల్యం నిర్ధారణకు సదరం స్లాట్ బుకింగ్ లను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. నవంబరు, డిసెంబరు నెలలకు సంబంధించి ఈ స్లాట్ బుకింగ్ లను ప్రారంభించనున్నట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.
సదరం స్లాట్ బుకింగ్ లకు...
ముందుగా స్లాట్ ను బుక్ చేసుకున్న దివ్యాంగులకు సూచించిన తేదీల్లో జిల్లా, బోధనాసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికెట్ల ప్రాతిపదికన దివ్యాంగుల పింఛన్లను మంజూరు చేయనున్నారు. పాక్షికంగా ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులకు నెలకు ఆరువేలు, మంచానికే పరిమితమయిన వారికి నెలకు పదిహేను వేల రూపాయలను ప్రభుత్వం ప్రతి నెల పింఛను ఇస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సదరం స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి దివ్యాంగులు సిద్దమవ్వాలని అధికారులు పేర్కొన్నారు.