Andhra Pradesh : టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఫలితాలు 22న విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 22వ తేదీన పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 164 పరీక్ష కేంద్రాల్లోపరీక్షలు రాశారు. ఏపీ పదోతరగతి పరీక్షల్లో మొత్తం 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు.
మూల్యాంకనం పూర్తి చేసి...
పదోతరగతి పరీక్షలు పూర్తి కావడంతో మూల్యాంకనం కూడా వెంటనే పూర్తి చేయగలిగారు. మార్చి లో పూర్తయిన పరీక్షలకు సంబంధించి మూల్యాంకనం పూర్తి కావడంతో ఇక రిజల్ట్ విడుదలకు విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల బోర్డు. విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా రోల్ నంబర్ ఉపయోగించి తెలుసుకోవచ్చని తెలిపారు.