పింఛనుదారులకు గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛనుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయనుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛనుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయనుంది. సాధారణంగా పింఛన్ల పంపిణీ ప్రతినెల ఒకటో తేదీన జరుగుతుంది. ఒకటో తేదీ ఒకవేళ సెలవు రోజులు, పండుగల వస్తే ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తుున్నారు. ఈసారి ఒకటో తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేయనున్నారు. జూన్ ఒకటిన ఆదివారం కావడంతో సెలవు దినం. అందుకే ఒకరోజు ముందుగా అంటే మే 31న పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
మే 31వ తేదీన...
మే 31న ఉదయం ఏడు గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ మొత్తాన్ని చెల్లిస్తారు. లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఒకవేళ మే 31న డబ్బులు తీసుకో లేకపోతే జూన్ రెండో తేదీన సచివాలయం వద్దకు వెళ్లి.. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు పింఛన్ తీసుకోవచ్చు. మే 31న పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండడంతో సచివాలయ సిబ్బంది మే 31న బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేయాల్సి ఉంటుంది. పింఛన్ తీసుకునేవారు ఈ మార్పును గమనించాలని అధికారులు చెబుతున్నారు.