Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓజీని ముందుగానే చూసేలా?
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓజీని ముందుగానే చూసేలా?
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పవన్ OG సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో జీవో ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రీమియర్ షోలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రేపు రాత్రి పదిగంటలకు...
25న తెల్లవారుజాము ఒంటిగంట నుంచి 24న రాత్రి 10 గంటలకు మార్పు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. OG ప్రీమియర్ షో కి రూ.1000 టికెట్ ధర నిర్ణయించిన ప్రభుత్వం తాజాగా ప్రీమియర్ షోలకు ప్రత్యేక జీవోను విడుదల చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ అందరికంటే ముందుగా సిల్వర్ స్క్రీన్ పై ఓజీ మూవీని వీక్షించడానికి వీలయిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.