Andhra Pradesh : గుడ్ న్యూస్.. 70 వేల మందికి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా పండగ లాంటి కబురు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు డెబ్భయి వేల మందికి గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2025-05-30 05:25 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు డెబ్భయి వేల మందికి గుడ్ న్యూస్ చెప్పింది. వారందరికీ తలా నాలుగు వేల రూపాయలు పింఛను ఇవ్వనుంది.ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద స్పౌజ్‌ పెన్షన్లను రేపటి నుంచి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి జూన్ 12వ తేదీ నాటికి ఏడాది పూర్తి కావస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. జూన్‌ 12 నుంచి పంపిణీకి సిద్ధం చేస్తుంది. కొత్తగా71,380 పెన్షన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకూ వీరికి ఎటువంటి ఆసరా లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకోవడం కోసం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ నిర్ణయం తీసుకుంది.

భర్త చనిపోయిన...
గతంలో పింఛను అందుకుంటున్న భర్త చనిపోతే సామాజిక పింఛనును అందించే వారు కాదు. దీంతో వితంతువులు ఆర్థికంగా ఇబ్బందులు పడే వారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భర్త చనిపోయిన వారికి అంటే వారికి అందే పింఛన్లను భార్యలకు తర్వాత నెలలో ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు అటువంటి వారిని గురించి ఆరా తీసింది. అలా భర్త చనిపోయి పింఛను లబ్ది పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చని కూడా అధికారులు కోరారు. గత ఏడాది నవంబరు ఒకటో తేదీ నుంచి దీనిని అమలులోకి ప్రభుత్వం తెచ్చింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరింది.
అర్హులైన వారిని...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 2023 డిసెంబరు ఒకటో తేదీ నుంచి 2024 అక్టోబరు 31వ తేదీ వరకూ మధ్య స్పౌజ్ కేటగిరీలో పింఛన్లు పొందిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు అందులో 71,380 మంది అర్హులుగా గుర్తించారు. వీరిందరికి మే నెల పింఛను జూన్ నెల 12వ తేదీన ఇవ్వనుంది. ప్రతి ఒక్కరికీ నాలుగు వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ నెల 12వ తేదీ నుంచి వారికి పింఛన్లు అందచేయనుననారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వారి ఇంటికివెళ్లి పింఛన్లను అందచేస్తారు. నిజంగాకూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇది తీపికబురు అని చెప్పాలి.
Tags:    

Similar News