Andhra Pradesh : స్థానిక సంస్థలకు భారీగా నిధులను విడుదల చేసిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల పరిషత్తులకు, పంచాయతీలకు రూ.1,121.20 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఇందులో పంచాయతీలకు 70 శాతం, మండల పరిషత్తులకు 20 శాతం, జిల్లా పరిషత్తులకు 10 శాతం నిధులను కేటాయించింది.
ఈ నిధులతో...
2024-25 సంవత్సరానికి రెండో విడతగా టైడ్, బేసిక్ కింద కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. జనాభా ఆధారంగా గ్రామీణ స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాలకు వీటిని పంచాయతీరాజ్‌శాఖ రెండు, మూడు రోజుల్లో జమ చేయనుంది. దీంతో సుదీర్ఘకాలంగా మండల, జిల్లా పరిషత్ లు, పంచాయతీల్లో పనులు చేయడానికి వీలవుతుంది.