బీసీ మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారు ఏర్పాటు చేసుకునే చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి రాయితీలను ప్రకటించింది. వివిధ యంత్రాలను కొనుగోలు చేయాల్సి వస్తే వాటి ధరపై ముప్ఫయి ఐదు శాతం నుంచి నలభై ఐదు శాతం వరకూ రాయితీ పెంచుతూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.
యంత్రాల కొనుగోలులో...
ఆంధ్రప్రదేశ్ లో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసుకునే మహిళలు, బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి మూలధన పెట్టుబడిలో ప్లాంటు, యంత్రాలపై రాయితీని 35 నుంచి 45 శాతానికి పెంచింది. విద్యుత్ టారిఫ్ లోనూ ప్రోత్సాహకాలు కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పే ఎస్సీ , ఎస్టీ లకు భూమి విలువలో 75 శాతం రాయితీ ని ప్రకటించింది. అంటే గరిష్ఠంగా 25 లక్షలు కల్పిస్తూ జీవో ఇచ్చింది.