అంగన్ వాడీ వర్కర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

అంగన్ వాడీ వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-01-28 11:45 GMT

అంగన్ వాడీ వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సర్వీసులో ఉంటూ మరణించిన అంగన్నాడీ వర్కర్ల, హెల్పర్ల అంత్యక్రియలకు పదిహేను వేల రూపాయలు మంజూరు చేయడం ద్వారా ఆ పథకాన్ని పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పథకాన్ని పొడిగించాలన్నది అంగన్ వాడీ వర్కర్లర ప్రధాన డిమాండ్ గా గత కొంతకాలంగా వినిపిస్తుంది.

ఉత్తర్వులు జారీ చేయడంతో...
ఈ మేరకు రాష్ట్ర స్త్రీలు, పిల్లలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల శాఖ కార్యదర్శి సూర్యకుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరణించిన అంగన్ వాడీ వర్కర్ల, హెల్పర్ల కు చెందిన చట్టబద్దమైన వారసులకు ఈ మొత్తం సొమ్మును చెల్లించాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. దీంతోఅంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు.


Tags:    

Similar News