Andhra Pradesh : టీచర్ల బదిలీలకు మార్గదర్శకాలివే

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల బదిలీలపై కొత్త చట్టం ప్రభుత్వం రూపొందించింది.

Update: 2025-03-02 05:33 GMT

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల బదిలీలపై కొత్త చట్టం ప్రభుత్వం రూపొందించింది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కొన్ని విధివిధానాలను ప్రకటించింది. ఇందుకోసం పనిచేసిన కాలాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసినవారు బదిలీకి అర్హులుగా పేర్కొంది. ఎనిమిది సంవత్సరాలు పూర్తయితే తప్పనిసరి బదిలీ చేయనున్నారు.

ఇవీ విధివిధానాలు...
వికలాంగులు, వితంతువులు, విడాకులు పొందిన స్త్రీలు, దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారికి ప్రత్యేక ప్రాధాన్యత బదిలీల్లో ఇవ్వనున్నారు. హెచ్‌ఆర్‌ఏ శాతం ఆధారంగా కేటగిరీ 1, 2, 3 (ఎ, బి, సి)లుగా పాఠశాలలను విభజించారు. ఏప్రిల్ 24, నుంచి 28వ తేదీ వరకూ రేషనలైజేషన్ జరుగుతుంది. పోస్టుల ఖాళీలను ఏప్రిల్ 29న ప్రదర్శిస్తారు. ఆన్ లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 30 వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకూ స్వీకరిస్తారు. ప్రధానోపాధ్యాయులు ఏప్రిల్ 16వ తేదీ 20వ తేదీ వరకూ పదోన్నతుల విషయంలో పరిశీలిస్తారు. స్కూల్ అసిస్టెంట్లు మే 26 వ తేదీనుంచి 30వ తేదీ వరకూ పదోన్నతుల విషయాన్ని పరిశీలిస్తారు.


Tags:    

Similar News