Andhra Pradesh : ఏపీలో 30 నామినేటెడ్ పోస్టుల భర్తీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. వరసగా జాబితాలను విడుదల చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. వరసగా జాబితాలను విడుదల చేస్తుంది. చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లేముందు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. తాజాగా ముప్ఫయి మార్కెట్ కమిటీ ఛైర్మన్ల పోస్టులను చంద్రబాబు నాయుడు భర్తీ చేశారు. అన్ని రకాలుగా సామాజికవర్గాల సమీకరణాలతో పాటు ప్రాంతాల వారీగా ఎంపిక చేశారు.
సింహభాగం టీడీపీకే...
ముప్ఫయి మార్కెట్ ఛైర్మన్ పదవుల్లో 25 తెలుగుదేశం పార్టీ తీసుకోగా, నాలుగు జనసేన తీసుకుంది. ఒకటి మాత్రం బీజేపీకి ఇచ్చింది. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ల పదవులను కూడా భర్తీ చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ వస్తున్న ప్రభుత్వం మహానాడుకు ముందే అన్ని పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.