Andhra Pradesh : వాహనమిత్రపై కీలక అప్ డేట్.. ఇలా చేయకుంటే దరఖాస్తులు తిరస్కరిస్తారు జాగ్రత్త
ఆటో, క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా పండగ నాటికి వాహనమిత్ర పధకం కింద పదిహేను వేల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయించింది
ఆటో, క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా పండగ నాటికి వాహనమిత్ర పధకం కింద పదిహేను వేల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి. దీంతో ఫిట్ నెస్ సెంటర్ల వద్దకు ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు వచ్చి తమ వాహనాలకు ఫిట్ నెస్ పరీక్షలు చేయించుకుంటున్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయంలో అందచేయాలని ప్రభుత్వం మార్గదర్శక సూత్రాల్లో పేర్కొంది. అన్నీ సక్రమంగా ఉండి, ఎలాంటి చలాన్లు పెండింగ్ లో ఉన్నా ఈ పథకం వర్తించని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే పొల్యూషన్ తో పాటు ఫిట్ నెస్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి అని పేర్కొంది.
అర్హులైన వారు ఎవరంటే?
దీంతో పాటు ఆటో, క్యాబ్ డ్రైవర్ ల డ్రైవింగ్ లైసెన్సును కూడా పరిశీలించనుంది. దీంతో పాటు లబ్దిదారుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లోనే ఉండాలి. రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. నెలకు మూడు వందల యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించాలి. తెలుపు రంగు రేషన్ కార్డులుండాలి. అలాగే నివాస, వ్యవసాయ భూమిపై కూడా పరిమితులను పెట్టింది. అన్ని నిబంధనలను సక్రమంగా ఉంటేనే వాహన మిత్ర పథకానికి ఎంపికవుతారని చెప్పింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోలు, క్యాబ్ లకు బేరాలు తగ్గడంతో ప్రభుత్వం గతంలో ఇచ్చిన పదివేల రూపాయల స్థానంలో ఏడాదికి అర్హులైన అందరికీ ఏడాదికి పదిహేను ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే నెల 1వ తేదీన చంద్రబాబు నాయుడు లబ్దిదారుల ఖాతాల్లో పదిహేను వేల నగదును జమ చేస్తారు.
ఇలా ఎంపిక...
ఆటోలు, క్యాబ్ ల నిర్వహణ, మరమ్మతులు వంటి వాటికి ఇవి ఉపయోగపడతాయని ప్రభుత్వం తెలిపింది. వాహన మిత్ర కొత్త దరఖాస్తుల సమాచారాన్ని కూడా పేర్కొంది. వాహన డిపార్ట్ మెంట్ డేటా బేస్ లో వాహనదారుని రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ RC పై ఉన్న పేరు సచివాలయ శాఖ ద్వారా ఈ కేవైసీ కు వచ్చిన డేటాబేస్ లో ఉన్న పేరు సరిపోయినట్టయితే అటువంటి దరఖాస్తులు నేరుగా వెరిఫికేషన్ కొరకు సచివాలయంలో వెల్ఫేర్ అధికారుల లాగిన్ కు వెళ్తాయి. రెండు డేటా బేస్ లలో పేర్లు మ్యాచ్ అవ్వకపోతే అటువంటి దరఖాస్తులు DL & RC వెరిఫికేషన్ కొరకు డీటీసీకి వెళ్లనున్నాయి. డీటీసీ సిఫార్సు చేసిన తర్వాత మాత్రమే సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అధికారుల లాగిన్ కు తదుపరి ప్రాసెస్ కోసం వస్తాయి.డీటీసీ రికమెండ్ చేయకపోతే అటువంటి దరఖాస్తులు రిజెక్ట్ అవుతాయి.