Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలివే.. ఇప్పుడు హ్యాపీనా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు పూర్తయింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు పూర్తయింది. ఈరోజు జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో దీనిపై చర్చించే అవకాశముంది. ఏపీలో ఇప్పటి వరకూ 26 జిల్లాలు ఉండగా అదనంగా మరొక ఆరు జిల్లాలను ఏర్పాటు చేసి మొత్తం 32 జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కొత్త జిల్లాల పునర్విభజన, ఏర్పాటుపై నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం ఈ మేరకు చంద్రబాబు నాయుడుకు నివేదిక అందించింది. జిల్లాల్లో పర్యటించిన ఉపసంఘం సభ్యులు ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుని, వారి అభ్యంతరాలను తెలుసుకున్న తర్వాత ముప్ఫయి రెండు నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక అందినట్లు తెలిసింది.
గత ప్రభుత్వం చేసిన...
గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాలను ఏర్పాటుచేసింది. దీంతో ఏపీలో మొత్తం 26 జిల్లాలయ్యాయి. ఆయన పార్లమెంటు నియోజకవర్గాలను ప్రాతిపదికగా చేసుకుని జిల్లాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేసిందన్న భావనతో కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు సిద్ధమయింది. నిజంగా కొన్ని ప్రాంతాలు జిల్లా కేంద్రానికి దూరమయ్యాయి. ఒంగోలు జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండే అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాలో కలపడం కూడా అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమస్యలు అనేక చోట్ల ఉన్నాయి. అందుకే ఈ సారి జిల్లాల పునర్విభజనలో ప్రజలకు పరిపాలనపరంగా ఇబ్బందులు లేకుండా చూడాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది.
ఐదు నియోజకవర్గాలను...
పలాస జిల్లా (ఇచ్ఛా పురం, పలాస, టెక్కలి, పాతపట్నం అసెంబ్లీ), శ్రీకాకుళం జిల్లా (శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్న పేట, ఎచ్చె ర్ల, రాజాం),పార్వతీపురం మన్యం జిల్లా(పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ), విజయనగరం జిల్లాలో (విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి ), విశాఖపట్నం జిల్లాలో (భీమిలి, విశాఖ ఈస్ట్, స్ట్విశాఖ వెస్ట్, స్ట్విశాఖ నార్త్,విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి ), . అల్లూరి సీతారామరాజు జిల్లాలో (అరకు, పాడేరు, మాడుగుల), అనకాపల్లి జిల్లాలో (అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం , యలమంచిలి, పాయకరావుపేట, తుని) కాకినాడ జిల్లాలో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గం పేట, పెద్దాపురం, రామచంద్రాపురం) తూర్పుగోదావరి జిల్లాలో( రాజమండ్రి సిటీ,రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం), బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో (అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, రాజోలు, కొత్తపేటత్త , మండపేట),
నూతనంగా ఏర్పాటయిన...
నరసాపురం జిల్లాలో (తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూల్లి డెం), ఏలూరు జిల్లాలో ( ఏలూరు, దెందులూరు,ఉంగుటూరు, గోపాలపురం, చింతలపూడి, పోలవరం), మచిలీపట్నం జిల్లాలో (కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం , అవనిగడ్డ, పామర్రు), ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలో (విజయవాడ ఈస్ట్, స్ట్విజయవాడ వెస్ట్,ఈస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, మైలవరం),అమరావతి జిల్లాలో పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి,జగ్గయ్యపేట,నందిగామ), గుంటూరు జిల్లాలో ( గుంటూరు ఈస్ట్, వెస్ట్, తెనాలి, పొన్నూరు,ప్రత్తిపాడు), బాపట్ల జిల్లాలో (బాపట్ల, వేమూరు, చీరాల, రేపల్లె, పర్చూరు), పల్నా డు జిల్లాలో (నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొం డ), మార్కా పురం జిల్లాలో మార్కా పురం, ఎర్రగొం డపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి), ఒంగోలుజిల్లాలో (ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడు, కొం డెపి,కందుకూరు) అసెంబ్లీ నియోజకవర్గాలుండనున్నాయి.
కొత్త జిల్లాలివే...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ( నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావాలి, కోవూరు, ఉదయగిరి), గూడూరు జిల్లాలో( గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, ల్లిసూళ్లూరుపేట), . శ్రీ బాలాజీ తిరుపతి జిల్లాలో (తిరుపతి, శ్రీకాళహస్తి, స్తిసత్యవేడు, నగరి, చంద్రగిరి), చిత్తూరు జిల్లాలో (చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు,పలమనేరు, కుప్పం), మదనపల్లి జిల్లాలో (మదనపల్లి, ల్లిపీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి), శ్రీ సత్యసాయి జిల్లాలో( హిందూపురం, కదిరి, ధర్మవరం,పుట్టపట్ట ర్తి, పెనుగొండ, మడకశిర), అనంతపురం జిల్లాలో (అనంతపురం, రాయదుర్గం , కళ్యాణదుర్గం , గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, తాడిపర్తి), ఆదోని జిల్లాలో (ఆదోని, పత్తికొంత్తి కొండ, ఆలూరు, ఎమ్మిగనూరు,మంత్రాలయం), కర్నూలు జిల్లాలో (కర్నూలు, డోన్, నందికొట్కూరు, కోడుమూరు),నంద్యాల జిల్లాలో నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగళ్లడ్డ, డ్డ బనగానపల్లె, పాణ్యం), వైఎస్సా ర్ కడప జిల్లాలో (కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు,మైదుకూరు, కమలాపురం, పులివెందుల), అన్నమయ్య జిల్లాలో (రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వే లు) అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అయితే ఇది అధికారిక సమాచారం కాదు. అందిన సమాచారం మాత్రమే.