ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయింది. తిరిగి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించింది.

Update: 2022-01-20 04:47 GMT

కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయింది. తిరిగి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన పలువురు ఐఏఎస్ అధికారుల బృందంతో ఈ కమాండ్ కంట్రోల్ ఇక పని చేయనుంది.

కమాండ్ కంట్రోల్ సెంటర్....
తక్షణమే ఈ కమాండ్ కంట్రోల్ ను ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోవిడ్ కేసుల పెరుగుదల, ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించడం, ఆక్సిజన్ నిల్లవు, ఐసొలేషన్ కిట్లు, మందుల పంపిణీ వంటివి ఈ కమాండ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుంది. నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ లో పదివేలకు పైగా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం తక్షణం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించింది.


Tags:    

Similar News