బీసీలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

బీసీ కులాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2025-11-27 12:23 GMT

బీసీ కులాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని అమరావతిలో అన్ని బీసీ కులాలకు భవనాలను నిర్మించనున్నట్లు ప్రకటించింది. అన్ని బీసీ కులాలకు అమరావతిలో భవనాలు నిర్మించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఆయా బీసీ కులాల కార్పొరేషన్ పాలక మండలి నేతృత్వంలోనే ఆదరణ 3.0 నిధులు వినియోగించనున్నట్లు వెల్లడించారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్దపీట వేస్తున్నారన్నారు. అయిదేళ్ల జగన్ పాలనలో బీసీలను అన్ని రకాల వేధింపులకు గురయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. విజయవాడ నగరంలోని గొల్లపూడి బీసీ భవన్ లో సగర కార్పొరేషన్ పాలక మండలి ప్రమాణ స్వీకారం గురువారం జరిగింది.

బీసీల సంక్షేమం కోసం...
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. బడుగు, బలహీన వర్గాల ఉన్నతే లక్ష్యంగా అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. బీసీల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. బీసీల కుల వృత్తులకు ఆర్థిక భరోసా కలిగించేలా ఆదరణ 3.0 పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని ఆయా బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్ల నేతృత్వంలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు.


Tags:    

Similar News