Andhra Pradesh : స్థానిక సంస్థలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2025-11-15 04:56 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు గుడ్ న్యూస్ చెప్పింది. స్థానిక సంస్థలకు 548.28 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం ఈ మేరకు స్థానిక సంస్థలకు విడుదల చేసింది. 2025-26 సంవత్సరానికి టైడ్ గ్రాంట్ కింద ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

స్థానిక సంస్థలకు...
ఈ విడుదల చేసిన నిధులను ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా, మడల పరిషత్, గ్రామ పంచాయతీలకు కేటాయిస్తూ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ ను ఆదేశిస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిధులను స్థానికంగా ఉండే సమస్యలను పరిష్కరించుకోవడానికి వినియోగించనున్నారు.


Tags:    

Similar News