Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసింది

Update: 2025-11-08 01:35 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసింది. గత నెల 11వ తేదీన బనకచర్ల ప్రాజెక్టుకు డీపీఆర్ కోసం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. అక్టోబరు 31వ తేదీ వరకూ టెండర్లకు చివరి తేదీగా నిర్ణయించింది. అయితే తాజాగా బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ కోసం ఆహ్వానించిన టెండర్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం విస్మయం కలిగిస్తుంది.

టెండర్లను రద్దు చేస్తూ...
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. తెలంగాణ ప్రభుత్వం పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా చేసింది. అయితే ఈ టెండర్లను ఎందుకు రద్దు చేశారన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే టెండర్లు రాకపోవడంతో వీటిని రద్దు చేశారా? లేక మరేదైనా కారణమా? అన్నది ప్రభుత్వమే వివరణ ఇవ్వాల్సి ఉంది.


Tags:    

Similar News