Andhra Pradesh : విజయానంద్ పదవీకాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ పదవీకాలాన్ని మరో మూడు నెలల కాలం పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ పదవీకాలాన్ని మరో మూడు నెలల కాలం పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయానంద్ నవంబరు 30 వతేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయనను మరో మూడు నెలల పాటు పదవిలో కొనసాగించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
మరో మూడు నెలలు...
దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు అంగీకరించనుంది. విజయానంద్ చీఫ్ సెక్రటరీగా ఫిబ్రవరి నెలాఖరు వరకూ తన పదవిలో కొనసాగేందుకు అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంతరం స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్‌కు సీఎస్‌గా అవకాశం ముఖ్యమంత్రి చంద్రాబు కల్పించనున్నట్లు తెలిసింది. మే 2026 తో సాయిప్రసాద్ పదవీ కాలం ముగియనుంది.