CM Jagan: మరో నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌: సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

ఏపీలో రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. ఆదివారం అద్దంకి నియోజకవర్గంలోని

Update: 2024-03-10 11:57 GMT

Ys Jagan

ఏపీలో రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. ఆదివారం అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో సిద్ధం సభ భారీగా నిర్వహిస్తున్నారు. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల క్యాడర్‌ని ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేసే లక్ష్యంతో ఈ సిద్ధం సభ నిర్వహించింది వైసీపీ. ఈ సభకు దాదాపు 15 లక్షల మంది కార్యకర్తలు మెదరమెట్ల సభకి హాజరయ్యారు. సిద్ధం తొలి సభను ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పరిధిలో.. రెండో సభను ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి దెందులూరు నియోజకవర్గ సమీపంలో.. మూడో సభను రాయలసీమ జిల్లాలకు సంబంధించి అనంతపురం రాప్తాడులో భారీ ఎత్తున నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ రానుందని వ్యాఖ్యానించారు. సభను చూస్తుంటే జన మహాసముద్రం కనిపిస్తోందన్నారు. నమ్మకంతో వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు సీఎం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా.. ఎంత ప్రయత్నం చేసినా రాబోయే ప్రభుత్వం వైసీపీదేనని అన్నారు. చంద్రబాబు సైకిల్‌ ట్యూబ్‌, టైర్లు లేవని, చక్రాలు కూడా ఊడిపోయాయని అన్నారు. సైకిల్‌ను తొక్కేందుకు చంద్రబాబు ఢిల్లీ బాట పట్టారన్నారు.

ఓడిపోతాననే భయంతో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు ఢిల్లీ వెళ్లారని అన్నారు. వచ్చే ఎన్నికలు ఇది ధర్మ, అధర్మాల మధ్య జరిగే యుద్ధమని, ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర ప్రజలదేనని వ్యాఖ్యానించారు. ఈ యుద్ధంలో అర్జునుడి పాత్ర నాదని అన్నారు. చంద్రబాబు సైకిల్‌ పూర్తిగా తుప్పుపట్టిపోయిందన్నారు. నాకు నటించే 10 మంది స్టార్లు లేరని, నాకు పొత్తు పెట్టుకునే అవసరం లేదన్నారు. చంద్రబాబు ప్రజలకు కర్రుకాల్చి వాతపెట్టే రకమన్నారు.

Tags:    

Similar News