Godavari : గోదావరికి కొనసాగుతున్న వరద ప్రవాహం

ఉధృతంగా గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Update: 2025-08-31 03:24 GMT

ఉధృతంగా గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. భద్రాచలం వద్ద 47.9 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ఇన్,ఔట్ ఫ్లో 10.92 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. లంక గ్రామ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

అప్రమత్తంగా ఉండాలని...
ప్రధానంగా గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతుందని, మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.


Tags:    

Similar News